: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 'అరెస్టుల తెలంగాణా'గా మారింది: టి.టీడీపీ ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ ను ఖండిస్తున్నామని టి.టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం... అరెస్టుల తెలంగాణాగా మారిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గతంలో ఆంధ్రా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారని, ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించే వారిని ఈ ప్రభుత్వం ఇప్పుడెందుకు అరెస్టులు చేస్తోందని వివేకా ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని ప్రభుత్వానికి ఆయన సూచించారు.