: బీహార్ ఎన్నికల్లో నోట్ల కట్టల పంపిణీ షురూ... ఒకే చోట రూ.7 కోట్ల పట్టివేత


దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ ఎన్నికల్లో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ నేతృత్వంలోని కూటమి మధ్యే ప్రధాన పోటీగా జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్ కు ఇంకా చాలా సమయమే ఉంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే పోలింగ్ ఐదు దశల్లో పూర్తి కానుంది. అయితే అప్పుడే అక్కడ నోట్ల కట్టల పంపిణీ ఊపందుకుంది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తమైంది. ముమ్మర తనిఖీలకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని శరన్, శివాన్ జిల్లాల్లో నిన్న జరిపిన తనిఖీల్లో రూ.7 కోట్ల మేర నగదును పట్టివేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చాప్రా శివారులో ఒకే చోట రూ.7 కోట్ల నగదు పట్టుబడగా, శివాన్ సమీపంలో రూ.12 లక్షల నగదు పట్టుబడిందని సదరు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

  • Loading...

More Telugu News