: బంపర్ ఆఫర్ కొట్టేసిన సోనూసూద్
ప్రముఖ సీనీ నటుడు సోనూసూద్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో జాకీ చాన్ తాజా చిత్రం 'కుంగ్ ఫూ యోగా'లో ఓ ప్రధాన పాత్రలో సోనూ నటిస్తున్నాడు. బీజింగ్ తో పాటు ఇండియాలో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సోనూసూద్ క్యారెక్టర్ జాకీ చాన్ కు సమానంగా ఉంటుందట. స్టాన్లీ టాంగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొంత కాలంగా సోనూ సూద్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే, ఓ భారీ ప్రాజెక్ట్ తో త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ సమాధానం ఇచ్చేవాడు. చెప్పినట్టుగానే, ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.