: కృష్ణానదీ జలాలను ఎలా పంచాలో తుది విచారణలో తేలుస్తాం: సుప్రీంకోర్టు


కృష్ణానదీ జలాల పంపకాలు నాలుగు రాష్ట్రాల మధ్య చేబట్టాలా? లేక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చేపట్టాలా? అన్న అంశాన్ని తుది విచారణలో తేలుస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు. కృష్ణానదీ జలాల వివాదం కేసుపై కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అక్టోబర్ 15న తుది విచారణ చేపడతామని జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రఫుల్ సి.పంత్ తో కూడిన ధర్మాసనం తెలిసింది. ట్రైబ్యునల్, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 పరిధులను తుది విచారణలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News