: కర్నూలు మయూరి బేకరీలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం
కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెంటర్ లోని మయూరి బేకరీలో సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. దాంతో బేకరీ అంతటా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో బేకరీ యజమానులు, చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో బేకరీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం వల్ల రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.