: గాంభీర్యం చెడగొడితే...రైతుల మనోస్థైర్యం దెబ్బతీసినట్టవుతుంది: సభలో టీ సీఎం కేసీఆర్
రైతుల ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చకు అడ్డు తగలొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో వేరే అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతు ఆత్మహత్యల అంశం గాంభీర్యం చెడగొడితే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్టు అవుతుంది. దీన్ని పూర్తి చేసిన తర్వాత ఎన్ని రోజులైనా చర్చించుకుందాం. సాంకేతిక అంశాలు లేవనెత్తి చర్చను అడ్డుకోవడం మంచిది కాదు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధం ఉన్నాం’’ అని కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై చర్చకు టీడీపీ, వామపక్షాల సభ్యులు పట్టుబట్టడంతో కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. అయినా విపక్షాల సభ్యులు వినకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ మాట్లాడాలనుకునే సభ్యులకు మైకులివ్వండి అని స్పీకర్ ను కోరారు.