: చుక్కా రామయ్య హౌస్ అరెస్ట్... వరవరరావు కోసం గాలింపు


ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ 400 ప్రజా సంఘాలు నేడు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని తిప్పికొట్టే క్రమంలో నిన్న రాత్రి నుంచే ముందస్తు అరెస్టుల పర్వానికి తెరతీసిన పోలీసులు, నేటి ఉదయం చుక్కా రామయ్యకు గృహ నిర్బంధం విధించారు. ఇక నేటి తెల్లవారుజామున పోలీసులు తన ఇంటికి వచ్చేలోగానే బయటకు వెళ్లిపోయిన విరసం నేత వరవరరావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సోదాలు, ముందస్తు అరెస్టుల నేపథ్యంలో హైదరాబాదుతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News