: ఐఏఎస్ ఇలంబరిదికి జైలు శిక్ష: హైకోర్టు ఆదేశం


కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ఇలంబరిదికి హైకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ఇలంబరిది ఉన్నప్పుడు తనకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఒక రైతు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణ జరిపిన హైకోర్టు సదరు రైతుకు నష్టపరిహారమివ్వాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలంబరిది బేఖాతరు చేయడంతో ధిక్కరణ కేసుగా పరిగణించిన హైకోర్టు విచారణ జరిపింది. ఇలంబరిదితో పాటు సత్తుపల్లి డీఈవో శ్రీనివాస్ రెడ్డికి కూడా నాలుగు నెలల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News