: నెటిజన్లను వణికిస్తున్న హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్!


నెటిజన్లను మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్ వణికిస్తోంది. వరల్డ్ మోస్ట్ డేంజరస్ బ్యూటీగా కెల్లీ బ్రూక్ ను నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, కెల్లీ బ్రూక్ ఫోటోపై అభిమానం కొద్దీ క్లిక్ చేస్తే చాలు వైరస్ మన సిస్టమ్ లోకి చొరబడి మొత్తం డేటాను ధ్వంసం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కెల్లీ బ్రూక్ ఫోటోలపై క్లిక్ చేసుకునే ముందు ఆలోచించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆమె ఒక్కతే కాదు, ఫెర్నాండెజ్ వెర్సిని, డచ్ డ్యాన్స్ వీజే ఆర్మిన్ వాన్ బూరెన్లు కూడా కెల్లీ బ్రూక్ సరసన చేరారు. ఈ ముగ్గుర్లో ఎవరి ఫోటోపై క్లిక్ చేసినా, చేజేతులా తమ కంప్యూటర్ ను నాశనం చేసుకున్నట్టేనని నిపుణులు సూచిస్తున్నారు. యూకేలో నెటిజన్లు వీరి ఫోటోలు చూస్తేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు అందగత్తెగా పేరొందిన కెల్లీ బ్రూక్ వైరస్ కారణంగా డేంజరస్ బ్యూటీగా పేరుతెచ్చుకుంటోంది.

  • Loading...

More Telugu News