: వారానికి మూడు రోజులు విజయవాడలో ఉంటా: నారా లోకేష్
‘వారానికి మూడు రోజులు విజయవాడలో ఉంటా. నెలకోసారి దత్తత గ్రామంలో పర్యటిస్తా. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా కొమరవోలు, నిమ్మకూరులను నిలబెడతాము’ అని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలులో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమ్మకూరును తాను, కొమరవోలును తన తల్లి దత్తత తీసుకున్నామని అన్నారు. ఈ రెండు గ్రామాలను తీర్చిదిద్దుతామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నారా లోకేశ్ పర్యటన సందర్భంగా కొమరవోలులో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో ఈ పర్యటనలో పాల్గొన్నారు.