: ఈ మ్యాచ్ ని నా ఫిట్ నెస్ పరీక్షగా భావించా: ధావన్


బంగ్లాదేశ్-ఏ జట్టుతో జరిగిన మూడు రోజుల మ్యాచ్ ను తన ఫిట్ నెస్ పరీక్షగా భావించానని భారత్-ఏ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. ఢిల్లీలో ధావన్ మాట్లాడుతూ, యువ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించడం ఆనందాన్నిచ్చిందని అన్నాడు. బంగ్లా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చేసిన ప్రదర్శన సౌతాఫ్రికాతో సిరీస్ లో కూడా చేయాలని భావిస్తున్నానని అన్నాడు. నెల రోజుల తరువాత ఆడిన మ్యాచ్ లో రాణించడం తనకు సంతోషం ఇచ్చిందని తెలిపాడు. సఫారీలతో అక్టోబర్ 2న ప్రారంభం కానున్న టీట్వింటీ సిరీస్ కు సిద్ధంగా ఉన్నానని ధావన్ చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్ లో ధావన్ 150 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News