: లాలూపై ఎఫ్ఐఆర్ నమోదు: ఎన్నికల సంఘం


రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్ ప్రచారంలో లాలూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘం పేర్కొంది. కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ఈ కారణంగానే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కులాలన్నీ ఒక తాటిపైకి వచ్చి జనతాపరివార్ కు ఓట్లు వేయాలంటూ లాలూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో జనతాపరివార్ కూటమికి, ఎన్డీయే కూటమికి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

  • Loading...

More Telugu News