: ఎదుటి వారి చూపులకు స్పందించే డ్రెస్
ఎదుటి వారి చూపులకు అనుగుణంగా స్పందించే డ్రెస్ ను గతంలో చైనా డిజైనర్ ఒకరు కనిపెడితే, తాజాగా 3డీ పరిజ్ఞానంతో ఇలాంటి ప్రత్యేకమైన డ్రెస్ ను రూపొందించామని పరిశోధకులు తెలిపారు. ఈ డ్రెస్ ను సున్నితమైన క్లాత్ తో రూపొందించినట్టు వారు పేర్కొన్నారు. ఈ డ్రెస్ ఎదుటి వారి చూపులకు అనుగుణంగా స్పందిస్తుందని చెప్పారు. ఎదుటి వారి చూపులను పసిగట్టేందుకు ఇందులో కెమెరా అమర్చి, మైక్రో కంట్రోలర్ తో అనుసంధానించారు. దీనిని ధరించిన వారికి సౌకర్యవంతంగా ఉంటుందని అమెరికాకు చెందిన డిజైనర్ బెహనాజ్ ఫరాహి తెలిపారు. ఇది ఎదుటి వారి చూపులను బట్టి స్పందిస్తుందని, ఆ ప్రకారంగా సంకోచ వ్యాకోచాలు కలిగి ఉంటుందని చెప్పారు. దీనికి 'కేరెస్ ఆఫ్ ది గేజ్' అని పేరుపెట్టామని చెప్పారు. ఈ డ్రెస్ ను ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారో కచ్చితంగా చెప్పనప్పటికీ ఏ క్షణానైనా విడుదల చేసే అవకాశం ఉందని వారు వివరించారు. దీని ధరను నిర్ణయించాల్సి ఉందని వారు పేర్కొన్నారు.