: మైత్రీ ప్లాంటేషన్ నక్షత్ర బిల్డర్ల భూములు జప్తు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైత్రీ ప్లాంటేషన్ నక్షత్ర బిల్డర్స్ కు చెందిన భూములను జప్తు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. 370 ఎకరాలను జప్తు చేశారు. మదుపుదారులకు రూ.100 కోట్లకు పైగా బకాయిలు చెల్లించని కారణంగానే ఈ సంస్థ భూములను జప్తు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ అధినేతల భాగస్వాముల ఆస్తులు జప్తు చేసినట్లు హోం శాఖ అధికారులు వెల్లడించారు.