: రేపటి ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి
చలో అసెంబ్లీ పేరిట అసెంబ్లీ ముట్టడికి దిగనున్న వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించామన్నారు. ఈ రెండు కిలోమీటర్ల పరిధిలో సమావేశాలు, సభలు, ర్యాలీలను నిషేధించామని చెప్పారు. ఈ ఆంక్షలను ధిక్కరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు.