: పదిహేను నెలల్లో విశాఖను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: బాబు ఆదేశం
కేవలం పదిహేను నెలల్లో విశాఖపట్టణాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేయాలని యూఎన్టీడీఏ, అయికాం, కెపీఎంజీ, ఐబీఎం, కన్ సోర్టియం ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. విశాఖపట్టణంలోని నోవాటెల్ హోటల్ లో ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఆయన విశాఖను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రణాళికలపై చర్చించారు. డిసెంబర్ లో ఆకర్షణీయ నగర ప్రణాళికపై కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని కోరారు.