: స్కిప్పర్ గా కోహ్లీ నా కన్నా బాగా రాణించాలి: గంగూలీ
స్కిప్పర్ గా విరాట్ కోహ్లీ తన కన్నా బాగా రాణించాలని కోరుకుంటున్నానని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఈరోజు గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ తాను టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానినని అన్నారు. మనదేశాన్ని గెలిపించాలని కోహ్లీలో ఉన్న తపన, పట్టుదల తనకు నచ్చాయని గంగూలీ అన్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, కానీ, ఎప్పుడూ గెలవాలనే తపనే విరాట్ లో కనపడుతుందంటూ మాజీ క్రికెటర్ గంగూలి ప్రశంసలతో ముంచెత్తారు.