: మోదీని కలిశారని, జుకెర్ బర్గ్ కు 250 శానిటైజర్ బాటిళ్లు పంపారు
ఫేస్ బుక్ అధినేత చేతులు కడుక్కునేందుకు ఎవరో శానిటైజర్ బాటిళ్లు పంపడమేంటనే అనుమానం వచ్చిందా? అవును, మోదీని కలిసిన జుకెర్ బర్గ్ చేతులు రక్తంతో తడిశాయని వాటిని కడుక్కునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని 'అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ' కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. గుజరాత్ లో సంభవించిన గోద్రా అల్లర్లకు కారణమైన మోదీతో భేటీ అయిన జుకెర్ బర్గ్ కు ఆ రక్తం మరకలు అంటాయని, అతని చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని ప్రజలను కోరారు. ఇప్పటికే 250 శానిటైజర్ బాటిల్స్ పంపినట్టు వారు వెల్లడించారు.