: జగన్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి: లోకేష్


వైకాపా అధినేత జగన్ పై టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ మండిపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా పనిచేస్తుంటే, జగన్ మాత్రం అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రజల అభ్యున్నతి కోసం ఈ వయసులో కూడా చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన, కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News