: భారత్ పై పాక్ ఆరోపణలు వాస్తవం కాదు: బీఎస్ఎఫ్ ఐజీ
జమ్ముూ కాశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంట గోడ నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను సరిహద్దు భద్రతాదళ ఐజీ రాకేశ్ శర్మ ఖండించారు. పాక్ ఆరోపిస్తున్నట్టుగా సరిహద్దులో తాము ఎలాంటి గోడను నిర్మించడం లేదని తెలిపారు. అయినా, గోడ కట్టడం సాధ్యమయ్యే అంశం కాదన్నారు. పాక్ కట్టుకథలు అల్లుతోందని చెప్పారు. పాక్ ఎందుకు ఇలాంటి కథలు అల్లుతోందో తెలియదని, ఈ చర్యల పట్ల తాను ఆశ్చర్యపోయానని ఐజీ రాకేశ్ పేర్కొన్నారు.