: బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎంపై ఎఫ్ఐఆర్


బీహార్ లో శాసనసభ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ఓటర్లకు తాయిలాలు ప్రకటించారు. దీంతో, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆయన ఉచిత కానుకలను ప్రకటించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, ఆయనపై కేసు నమోదైంది. భబువా జిల్లాలో నిన్న సుశీల్ కుమార్ మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, లాప్ టాప్ లు, చీరలు, కలర్ టీవీలు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించారు. దీంతో, ఓటర్లను ప్రలోభపెట్టారంటూ సుశీల్ కుమార్ పై జిల్లా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News