: చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై మంత్రి తలసాని విమర్శలు
ఇటీవల నారా లోకేశ్ ప్రకటించిన కుటుంబ ఆస్తుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆస్తుల వివరాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇంటి విలువ రూ.23 లక్షలేనా? అని అడిగారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన అంతా ఒట్టిదేనని వ్యాఖ్యానించారు. తాను రూ.3 కోట్లు ఇప్పిస్తానని, చంద్రబాబు తన ఇంటిని అమ్ముతారా? అని అడిగారు. తాను ఇంటిలో కూర్చున్నా ఎన్నికల్లో గెలుస్తానని తలసాని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపోటములను తాము పట్టించుకోమని చెప్పారు. వచ్చే మూడు సంవత్సరాలలో ప్రభుత్వం అద్భుతం చేసి చూపిస్తుందని మీడియాతో పేర్కొన్నారు.