: ఆర్ బీఐ రెపో రేట్లను తగ్గించడాన్ని స్వాగతించిన అరుణ్ జైట్లీ


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆర్ బీఐ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ ప్రసంగిస్తూ రెపో రేట్లపై స్పందించారు. విదేశీ పెట్టుబడులు వస్తాయని, కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతాయని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. 7.25 శాతం నుంచి రెపో రేటు 6.75 శాతానికి తగ్గిందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరంతరం సమీక్షిస్తుండాలని, భవిష్యత్ లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని చెప్పడానికి ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని జైట్లీ తెలిపారు.

  • Loading...

More Telugu News