: క్రిస్టియన్, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ, జైలు మొత్తం పరార్!
క్రిస్టియన్, ముస్లిం వర్గాల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లోని బంగుయి ప్రధాన జైలుపై దాడులు జరుగగా, జైల్లోని 500కు పైగా ఖైదీలు పరారయ్యారు. ఈ ఘర్షణల కారణంగా 40 మంది వరకూ చనిపోయారని, వీరిలో ముగ్గురు టీనేజి పిల్లలున్నారని, ప్రస్తుతం జైల్లో ఒక్క ఖైదీ కూడా లేడని భద్రతా సిబ్బంది వెల్లడించారు. వందలమంది క్రిస్టియన్ మిలిషియా నిరసనకారులు ఒక్కసారిగా జైలుపై లూటీకి దిగారని, తలుపులు పగులగొట్టి ఖైదీలు బయటకు పారిపోయేందుకు సహకరించారని అధికారులు తెలిపారు. వీరిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.