: అటు మోదం, ఇటు ఖేదం... ఆర్బీఐ నిర్ణయంతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు కలిగే నష్టమిదే!


రెపో రేటును అర శాతం తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం పేదలు, మధ్య తరగతి ప్రజలకు నష్టం కలిగించనుంది. వడ్డీ రేట్ల కోతతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి లాభం కలగనుండగా, అవే బ్యాంకుల్లో డబ్బులను పొదుపు చేసుకునేవారు నష్టపోయే ప్రమాదం ఎదురుకానుంది. వివిధ రకాల ఫిక్సెడ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేటు తగ్గనుండటమే ఇందుకు కారణం. ఆర్బీఐ రెపో రేటును సవరించిన నేపథ్యంలో పొదుపు ఖాతాలపై వడ్డీలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మధ్యాహ్నం స్వయంగా ప్రకటించారు. రాజన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్థికవృద్ధి మెరుగుపడుతుందని వ్యాఖ్యానించిన ఆయన, బ్యాంకులపై ఒత్తిడి పెరగకుండా చూసేందుకు డిపాజిట్లు, ఖాతాలపై వడ్డీలను సవరించాల్సి వుందని అభిప్రాయపడ్డారు. దీంతో చిన్న మొత్తాలను పొదుపు చేసుకుంటున్న బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో కొత్త గుబులు పుట్టింది. దేశవ్యాప్తంగా అత్యధికులు బ్యాంకుల్లో తమ డబ్బును దాచుకుని వచ్చే వడ్డీతో కాలం గడుపుతుండగా, వారందరికీ లభించే మొత్తం తగ్గనుంది.

  • Loading...

More Telugu News