: ఎయిర్ కెనడా విమానంలో చిన్నారి ప్రాణాలను కాపాడిన భారత వైద్యుడు


ఓ భారత సంతతి వైద్యుడి త్వరిత స్పందన, సమయస్పూర్తి రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడాయి. విమానంలో ఆక్సిజన్ తగ్గిన వేళ, ఓ కప్పు, బాటిల్ సహాయంతో డాక్టర్ ఖుర్షీద్ గురు చేసిన పని ఆ చిన్నారికి ఊరటనిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూయార్క్ లోని రోజ్ వెల్ పార్క్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో రోబోటిక్ సర్జరీ విభాగం డైరెక్టరుగా ఉన్న డాక్టర్ ఖుర్షీద్ ఎయిర్ కెనడా విమానంలో స్పెయిన్ నుంచి యూఎస్ వెళుతున్నాడు. అదే విమానంలో ఉన్న ఓ బాలుడు ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతూ, ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. అతనికి ఆస్తమా ఉందని, ఆక్సిజన్ స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకుందని, ఆక్సిజన్ తో పాటు ఆస్తమా మందు కూడా ఒకేసారి అందిస్తేనే స్వాంతన పొందుతాడని గమనించారు. కానీ విమానంలో పెద్దలకు పనికొచ్చే ఆక్సిజన్ ఇన్ హీలర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో తన మెదడుకు పదును పెట్టి, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ట్యూబ్ ఓ వాటర్ బాటిల్, కప్ లను ఉపయోగించి నెబ్యులైజర్ ను తయారు చేశారు. ఓ వాటర్ బాటిల్ ను కట్ చేసిన ఆయన ఓ వైపు నుంచి ఆక్సిజన్ ను, ఆపై బాటిల్ కు ఓ చిన్న రంద్రం చేసి ఆస్తమా ఇన్ హీలర్ ను పంపాడు. అప్పటికీ చిన్నారి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, ఓ చిన్న కప్పును తీసుకొచ్చి దానికి వెనుకవైపు రంద్రం చేసి దానికి, వాటర్ బాటిల్ ను అనుసంధానించి కప్పును చిన్నారి ముక్కు దగ్గర పెట్టాడు. దీంతో చిన్నారికి సరిపడా ఆక్సిజన్ అంది, ఓ 30 నిమిషాల తరువాత సర్దుకున్నాడు. విమానం దిగే సమయానికి తన తల్లితో ఆడుకుంటున్న చిన్నారిని చూసి తనకెంతో ఆనందం కలిగిందని చెబుతున్నారు డాక్టర్ ఖుర్షీద్ గురు.

  • Loading...

More Telugu News