: మోదీ, ఒబామా భేటీ అయ్యారు


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రధానికి ఒబామా సాదర స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనంతో పరస్పరం అభిమానం వ్యక్తం చేసుకున్నారు. ఏడాది కాలంలో వీరిరువురూ కలవడం ఇది మూడోసారి. సుమారు గంటా పది నిమిషాలు సమావేశం కానున్న వీరిద్దరూ కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వీసా ఫీజులు తగ్గించడం, వీసాలు సరళీకృతం చేయడం వంటి అంశాలపై మోదీ ఒబామాకు పలు సూచనలు చేయనున్నారు. పర్యటన విశేషాలు, రెండు దేశాలు పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు పెంపొందించుకునే దిశగా చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News