: చైనా తీరాన్ని తాకనున్న భారీ టైఫూన్


చైనా తీరాన్ని భారీ టైఫూన్ దుజువాన్ తాకనుంది. దుజువాన్ టైఫూన్ కారణంగా ఆగ్నేయ చైనాలో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇక్కడి వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దుజువాన్ టైఫూన్ తాకనుండటంతో చైనాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుజాన్, షాంఘై, తైవాన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో నౌకలన్నీ హార్బర్ కు తిరిగిరావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News