: బౌలింగ్ మా ప్రధాన ఆయుధం: సౌతాఫ్రికా


భారత్ లో విజయం సాధించడానికి తమ బౌలింగ్ వనరులు ప్రధాన ఆయుధాలని సౌతాఫ్రికా కోచ్ రస్సెల్ డొమినొగో తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉపఖండానికి సరిపడా స్పిన్ తో దాడి చేసేందుకు ఇమ్రాన్ తాహిర్ సిద్ధంగా ఉన్నాడని అన్నారు. తమకు ప్రధాన బలం సీమ్ బౌలింగ్ అని చెప్పిన ఆయన భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పై దాడి చేసేందుకు డేల్ స్టెయిన్, మోర్నే మోర్కెల్ సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా స్టెయిన్, మోర్కెల్ లపైనే తమ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. స్పిన్ ను ఆడడంలో టీమిండియా ఎప్పుడూ బలంగా ఉంటుందని తెలిపిన ఆయన, సీమ్ బౌలర్లు రాణిస్తే సిరీస్ విజయం నల్లేరుమీద నడకేనని ఆయన పేర్కొన్నారు. కాగా, స్టెయిన్, మోర్కెల్ ఇద్దరికీ ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. పరుగులను నియంత్రించడంలో, వికెట్లు తీయడంలో వీరిద్దరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.

  • Loading...

More Telugu News