: ఎంత డబ్బైనా ఇస్తాం...మా కుమార్తెనివ్వండి: అదితి తండ్రి


ఎంత డబ్బైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తన కుమార్తెను ఎవరైనా రక్షించి ఉంటే తనకు అప్పగించాలని అదితి తండ్రి చాడ శ్రీనివాస్ తెలిపారు. ఐదు రోజుల క్రితం విశాఖలో కురిసిన భారీ వర్షం కారణంగా అదితి గల్లంతైన విషయం తెలిసిందే. తన కుమార్తె మృతి చెందిందని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కుమార్తె బట్టలు, చెప్పులు, స్కూలు బ్యాగు వంటివేవీ దొరకలేదని ఆయన గుర్తు చేశారు. అంటే తన కుమార్తె మృతిచెంది ఉంటుందని తాను భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలోని హెచ్ బీ కాలనీ నుంచి సముద్రం వరకు అంగుళం అంగుళం శోధించామని, అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News