: సీపీఐ ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్
సీపీఐ ఛలో అసెంబ్లీకి హైదరాబాదు పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ ను బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొంటూ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఎల్లుండి 'అసెంబ్లీ ముట్టడి'కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఛలో అసెంబ్లీ'కి అనుమతి కావాలని కోరుతూ హైదరాబాదు పోలీస్ శాఖకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి దరఖాస్తు చేశారు. అయితే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసు ఉన్నతాధికారులు 'ఛలో అసెంబ్లీ'కి అనుమతి నిరాకరించారు. దీనిపై వామపక్ష పార్టీలతో పాటు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.