: అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ సేల్'
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెండో ఎడిషన్ 'బిగ్ బిలియన్ సేల్' ను ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు 'బిగ్ బిలియన్ సేల్' ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. గతేడాది జరిగిన పొరపాట్లకు ఫ్లిప్ కార్ట్ క్షమాపణలు తెలిపింది. ఈ ఏడాది అలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చింది. 75 శాతం సేల్ మొబైల్ మాధ్యమంగా జరుగుతుందని గుర్తించిన ఫ్లిప్ కార్ట్ ఈ ఏడాది సేల్ మొబైల్ యాప్ యూజర్లకు మాత్రమేనని తెలిపింది. మింత్రాలో కూడా ఆఫర్లు వస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ లో మింత్రా కూడా భాగస్వామి అని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ సారి కూడా భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయని ఫ్లిప్ కార్ట్ అభిప్రాయపడుతోంది.