: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: పాప్ సింగర్ కాన్యే వెస్ట్


అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేయాలనుకుంటున్నానంటూ యూఎస్ లో ప్రజాదరణ పొందిన హీరోయిన్ కిమ్ కర్దాషి యాన్ భర్త కాన్యే వెస్ట్ ప్రకటించాడు. అయితే, ఈ ఎన్నికల్లో కాదట, '2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో' అని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంచి పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్ ఈ ఏడాది ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల ఫంక్షన్ లో పాల్గొంటూ ఈ ప్రకటన చేశాడు. ‘ఆ ఎన్నికల్లో కనుక నేను విజయం సాధిస్తే, అమెరికాలో అందరూ గెలిచినట్లే’ అని కాన్యే పేర్కొన్నాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి, వారి విద్యార్హతల గురించి మాట్లాడాడు. కాగా, కాన్యే తన అర్హతల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని, కాన్యే కన్నా అతని భార్య పోటీ చేస్తే బాగుంటుందని అనుకున్నవారూ లేకపోలేదు.

  • Loading...

More Telugu News