: తాను ప్రధాని అనే విషయాన్ని మోదీ మర్చిపోతున్నారు: డి.రాజా


ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ నేత డి.రాజా విమర్శలు గుప్పించారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా తాను ప్రధానమంత్రి అనే విషయాన్ని మోదీ మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ప్రభుత్వ విధానాలను మోదీ ప్రకటిస్తుంటారని... ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే ఆయన ఇలా చేయడం దారుణమని అన్నారు. ఎప్పుడు విదేశాలకెళ్లినా ప్రచారంలో మునిగిపోయినట్టుగానే మోదీ ప్రవర్తిస్తారని మండిపడ్డారు. మోదీ విధానం లౌకిక వ్యవస్థపైనే దాడి చేస్తున్నట్టు ఉంటుందని అన్నారు. జపాన్ వెళ్లినప్పుడు భగవద్గీత ఇవ్వడం, ఐర్లాండ్ లో సంస్కృత శ్లోకాలను వినడం, తదితర అంశాలన్నీ మోదీ వ్యక్తిత్వానికి నిదర్శనాలని విమర్శించారు. ఇలాంటివన్నీ దేశ గౌరవాన్ని విదేశాల్లో అమ్ముకోవడమే అవుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News