: 30వ తేదీన జగన్ పరామర్శ యాత్ర


వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాలో పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ వివరాలను వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పొగాకు రైతుల ఆత్మహత్యలపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకనే పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. రైతులు బలవన్మరణాల విషయాన్ని గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

  • Loading...

More Telugu News