: చంద్రబాబు విగ్రహాలను ప్రతిష్ఠించుకునేందుకు ఏపీ గ్రామాల పోటాపోటీ!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విగ్రహాలను ప్రతిష్ఠించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలు, ముఖ్యంగా గుంటూరు జిల్లా గ్రామాలు పోటీ పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంచ మండలంలో విగ్రహాల తయారీకి పేరెన్నికగన్న నాధరామేశ్వరం ఇప్పుడు చంద్రబాబు విగ్రహాల తయారీలో బిజీగా ఉంది. తుళ్లూరు, వినుకొండ, మంగళగిరి తదితర మండలాల నుంచి చంద్రబాబు విగ్రహాల కోసం ఆర్డర్లు వస్తున్నాయని ఇక్కడి విగ్రహాల తయారీ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయమై ప్రజల స్పందన కోరగా, రాష్ట్రం అభివృద్ధి దిశగా చంద్రబాబు చేస్తున్న పనులు తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని, అందువల్లే ఆయన విగ్రహాలను నిత్యమూ తమ కళ్ల ముందు ఉంచుకోవాలని భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News