: బెల్టు షాపులు రద్దు చేయండి... లేకపోతే ఉద్యమమే: అంబటి


ఏపీ ప్రభుత్వం బెల్టు షాపులను పెంచి పోషిస్తోందని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బెల్టు షాపుల వల్ల కుటుంబాల్లో చిచ్చు రేగుతోందని, బాంధవ్యాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. బెల్టు షాపులను రద్దు చేయాలని మహిళలు కోరుతున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బెల్టు షాపుల వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ రోజు ఆయన ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ను కలిశారు. రాష్ట్రంలో వెంటనే బెల్ట్ షాపులను రద్దు చేయాలంటూ ఆయనకు విన్నవించారు. ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. ఒకవేళ బెల్టు షాపులను రద్దు చేయకపోతే, వచ్చే నెల 10వ తేదీ నుంచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News