: ‘అనంత’ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ
అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఒకరు జైలు నుంచి పరారయ్యాడు. వివరాల్లోకెళితే... కర్నూలు జిల్లా చిందుకూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి ఓ హత్య కేసులో దోషిగా తేలాడు. ప్రస్తుతం అతడు అనంతపురంలోని ఓపెన్ ఎయిర్ జైల్లో ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే నేటి ఉదయం శ్రీధర్ రెడ్డి జైలు నుంచి పరారైనట్లు జైలు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం పోలీసులు శ్రీధర్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.