: కార్పొరేట్ విద్యాసంస్థలకు కర్నూలు ఎస్పీ రవికృష్ణ వార్నింగ్
కర్నూలు జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎస్పీ రవికృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్క విద్యార్థి కళాశాలలో చనిపోయినా, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాలేజీల్లో గ్రేడింగ్ విధానానికి తక్షణం స్వస్తి పలకాలని, ప్రతి విద్యార్థికీ స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఉదయం కనీస వ్యాయామం చేయించాలని, స్టడీ అవర్స్ పేరిట వారిని ఇబ్బందులు పెట్టరాదని అన్నారు. యాజమాన్యం తప్పిదాలతో ఒక్క ప్రాణం బలైనా సహించేది లేదని అన్న ఆయన, ప్రతి విద్యార్థి సమస్యనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తనతో డైరెక్టుగా చెప్పుకోవచ్చని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ మార్పులు వారంలోగా వచ్చి తీరాలని, ఆపై ఒక్క ఫిర్యాదు వచ్చినా కేసులు నమోదు చేస్తామని రవికృష్ణ తెలిపారు.