: గద్వాలను జిల్లా చేయాలంటూ భారీ ర్యాలీ


తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో, కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్న దిశగా సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహబూబ్ నగర్ జిల్లాలో అఖిలపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గద్వాల కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి. ఈ ర్యాలీలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాలమూరు జిల్లాలో గద్వాల ప్రాంతం అన్ని రకాలుగా నష్టపోయిందని అన్నారు. జూరాల తదితర ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే ఉన్నా, నీటి సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ తీరాలంటే గద్వాలను జిల్లాగా చేయడమొక్కటే పరిష్కారమని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News