: జగన్ దీక్షా స్థలాన్ని మార్చిన వైసీపీ... కొత్తగా నాలుగు స్థలాల ప్రతిపాదన


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన నిరాహార దీక్షా స్థలాన్ని మళ్లీ మార్చారు. రెండు రోజుల కిందట గుంటూరులో రెండు స్థలాలను ప్రతిపాదించిన వైసీపీ నేతలు, ఈ రోజు వాటి స్థానంలో నాలుగు స్ధలాలను ప్రతిపాదించారు. ఈ మేరకు పోలీసులకు లేఖ అందజేశారు. అయితే జగన్ దీక్షకు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలన్న నిర్ణయాన్ని కూడా ఆ పార్టీ విరమించుకుంది. అక్టోబర్ 7న దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతేనే అప్పుడు కోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో నేతలు ఉన్నారు.

  • Loading...

More Telugu News