: సినిమా స్టార్ లా మోదీ... భారత ప్రధాని అమెరికా పర్యటనపై పాక్ పత్రికల ఆసక్తికర కథనాలు


భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై పాకిస్థాన్ పత్రికలు ఆసక్తికర కథనాలు ప్రచురించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పలు దేశాల అధినేతలు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వీరందరిలోకి భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వార్తలకే ప్రపంచ మీడియా అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రత్యేకించి భారత్ ను శత్రు దేశంగా భావిస్తున్న పాక్ మీడియా మోదీపై ఆసక్తికర కథనాలను ప్రచురించింది. అమెరికాలో మోదీకి సినిమా స్టార్ తరహాలో స్వాగతం లభించిందని కీర్తించింది. తమ ప్రధాని షరీఫ్ మాత్రం ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మాత్రమే ఆ దేశ మీడియా రిపోర్ట్ చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ తదితర కార్యాలయాలకు వెళ్లిన మోదీకి అయా ప్రాంతాల్లో రెడ్ కార్పెట్ స్వాగతం లభించిందని పాక్ పత్రికలు పేర్కొన్నాయి. ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్ తరహా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు కూడా మోదీ సావధానంగా సమాధానాలిచ్చారని కూడా ప్రస్తావించాయి.

  • Loading...

More Telugu News