: మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు


మావోయిస్టులకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా కొయ్యూరులో కరపత్రాలు వెలిశాయి. గత రాత్రి కొయ్యూరు మండల కేంద్రంలోని రాజేంద్రపాలెంలో ఈ కరపత్రాలు దర్శనమిచ్చాయి. మావోల కారణంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కుంటుబడిందని కరపత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, పోలీస్ ఇన్ ఫార్మర్లు అని ఆరోపిస్తూ, అమాయక గిరిజనులను మావోయిస్టులు హతమారుస్తున్నారని మండిపడ్డారు. మావోల కారణంగా దండకారణ్యంలోని ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. అయితే, ఈ కరపత్రాలను ఎవరు ఉంచారనే విషయంలో పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News