: మీ ప్రేమ, మద్దతుకు చాలా థ్యాంక్స్: మహేష్ బాబు


తన అభిమానులకు ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశాడు. శ్రీమంతుడు సినిమా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సంతోషాన్ని ఆయన తన అభిమానులతో పంచుకున్నాడు. నిస్వార్థంగా మీరు అందిస్తున్న ప్రేమ, మద్దతుకు చాలా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి తోడు, ఒక ట్రైలర్ ను కూడా యూట్యూబ్ ద్వారా విడుదల చేసి, దాని లింక్ ను కూడా ట్విట్టర్ లో పెట్టాడు. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాగా శ్రీమంతుడు రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News