: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ దేవాలయానికి శంకుస్థాపన చేయనున్న మోదీ
గుంటూరు జిల్లా కొండవీడు వద్ద 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇస్కాన్ హంస ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అక్టోబర్ 22న మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇస్కాన్ దక్షిణ భారత ప్రతినిధి సత్యగోపీనాథ్ దాస్ మురారి హాజరుకానున్నారు. రూ.200 కోట్లతో వెన్నముద్ద గోపాలకృష్ణస్వామికి గుంటూరు జిల్లాలో స్వర్ణమందిర నిర్మాణం జరుగుతుంది. వేద, గోవు విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.