: అలా పడుకొని నిద్రిస్తే ఆరోగ్య లాభాలెన్నో!
సుఖంగా నిద్రపట్టడంతో పాటు, కొన్ని ఆరోగ్య లాభాలూ కలగాలంటే రాత్రుళ్లు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. నగ్నంగా నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని, దీనివల్ల గాఢనిద్ర పడుతుందని, దుస్తులు ధరించి నిద్రిస్తే, శరీర వేడిమి ఒక్కో చోట ఒక్కోలా ఉండి సుఖనిద్ర లభించదని హెల్త్ స్లీప్ అడ్వయిజర్ క్రిస్టొఫర్ వింటర్ అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన రీసెర్చ్ ప్రకారం, నగ్నంగా నిద్రిస్తే, ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయంటే... * ఒంటిపై ఎలాంటి దుస్తులూ లేకుండా నిద్రించడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. గాఢమైన నిద్ర కారణంగా శరీరానికి మేలు చేకూర్చే బ్రౌన్ ఫ్యాట్ పెరిగి, కొవ్వు కరుగుతుంది. * శరీరంలోని ప్రైవేటు భాగాల్లో చెమట పట్టదుకాబట్టి, ఇన్ఫెక్షన్లు, దురద వంటివి దూరమవుతాయి. * వీర్య కణాల వృద్ధి వేగంగా జరుగుతుంది. * ఇక జీవిత భాగస్వామి కూడా పక్కనే ఉంటే శరీరానికి ఎంతో ఉపయోగమైన ఆక్సీటోసిన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. * ఆక్సీటోసిన్ ను 'లవ్ హార్మోన్' అని కూడా అంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. * రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.