: సిలికాన్ వ్యాలీలో మోదీ ప్రసంగం హైలైట్స్


సిలికాన్ వ్యాలీలోని 'శాప్' సెంటరులో దాదాపు 16 వేల మంది ప్రవాస భారతీయుల కేరింతలు, 'మోదీ మోదీ' అంటూ మిన్నంటిన నినాదాల మధ్య ఉత్సాహభరితంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇవి. * నిన్నటి వరకూ 21వ శతాబ్దం ఆసియాదని అంగీకరించిన వ్యక్తులు, ఇప్పుడు ఇండియాదని చెబుతున్నారు. * ఇక్కడ కూర్చున్న మీరు, మీ వినూత్నతతో ప్రపంచాన్ని మారుస్తున్నారు. మారేందుకు సిద్ధంగా లేని ప్రజల గురించి చర్చించడం అనవసరం. * పేర్లు చెబుతూ రాజకీయ నేతలపై సులభంగానే ఆరోపణలు చేయవచ్చు. కానీ నేను ఆ పని చేయను. ఇండియాలోని ప్రజలు లంచాలిచ్చీ ఇచ్చీ విరక్తి చెందారు. * 19వ శతాబ్దంలో మా సిక్కు సోదరులు ఇక్కడికి వచ్చారు. రైతులుగా పనిచేస్తూ, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఇప్పుడు ఇండియాలో పేదరికంపై పోరాటం సాగుతోంది. * ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవాల సందర్భంగా ఉగ్రవాదులతో ఎవరు ఉన్నారు? మానవత్వంవైపు ఎవరు నిలిచారు? అన్న విషయాలను స్పష్టం చేయాల్సిన అవసరముంది. * మేమిప్పుడు అందరికీ జామ్ (JAM) అంటున్నాం. జే అంటే జన్ ధన్ ఖాతా, ఏ అంటే ఆధార్ కార్డు, ఎం అంటే మొబైల్ గవర్నెన్స్. * వరల్డ్ బ్యాంక్ నుంచి మూడీస్ వంటి ఎన్నో రీసెర్చ్ సంస్థల వరకూ ఇండియా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అంగీకరిస్తున్నాయి. * ఈ రోజు నేను మీ మధ్య ఉన్నాను. నాపై ఒక్క ఆరోపణ అన్నా వుందా? మీరెవరైనా చెప్పగలరా? నేను చెబుతున్నాను. దేశంకోసమే జీవిస్తానని, మరణిస్తానని. * నా 16 నెలల పనితీరుపై ప్రవాస భారతీయులు సర్టిఫికెట్ ఇవ్వాలి. నేను బాగా పనిచేస్తున్నానో లేదో మీరే తెలపాలి.

  • Loading...

More Telugu News