: గ్రానైట్ వ్యాపారి ఇంటిలో దోపిడీ దొంగల బీభత్సం
తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ దొంగల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇళ్లల్లోకి చొరబడుతున్న దొంగలు సదరు ఇళ్లల్లోని వ్యక్తులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బాధితులు తేరుకునేలోగానే చేతికందిన దానితో చెక్కేస్తున్నారు. ఈ తరహా ఘటన గడచిన రాత్రి ప్రకాశం జిల్లా మార్టూరులో చోటుచేసుకుంది. గ్రానైట్ వ్యాపారం చేస్తున్న అంజయ్య ఇంటిలోకి రాత్రి చొరబడ్డ దొంగలు స్వైర విహారం చేశారు. అంజయ్య, ఆయన కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి, ఇంటిలోని 78 తులాల బంగారం, కిలో వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దోపిడి దొంగల కోసం గాలిస్తున్నారు.