: శాప్ సెంటర్ కు చేరుకున్న మోదీ... భారత నినాదాలతో హోరెత్తుతున్న సెంటర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిన్న ప్రపంచ టెక్ దిగ్గజాల సీఈఓలతో జరిపిన భేటీలో యావత్తు ప్రపంచాన్ని తన ప్రసంగంతో మంత్రముగ్ధులను చేసిన మోదీ, కొద్దిసేపటి క్రితం కాలిఫోర్నియా చేరుకున్నారు. అక్కడి శాప్ సెంటర్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. మోదీ రాకకు ముందే సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన ఆ సెంటర్ మోదీ రాకతో భారత నినాదాలతో మారుమోగింది. గత పర్యటనలో మ్యాడిసన్ స్క్వేర్ మీటింగ్ ను తలపించేలా అక్కడి ప్రవాస భారతీయులు శాప్ సెంటర్ కు భారీగా తరలివచ్చారు.