: నవ్యాంధ్ర ప్రజలకు ‘బసవతారకం’ సేవలు...గుంటూరులో కేన్సర్ ఆసుపత్రికి సన్నాహాలు


కేన్సర్ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న ‘బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చీ ఇన్ స్టిట్యూట్’ తన సేవలను మరింతగా విస్తరించనుంది. దివంగత నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రి తెలుగు ప్రజలకే కాక పొరుగు రాష్ట్రాలకు చెందిన పేదలకు సైతం మెరుగైన వైద్య సేవలందించడంలో తనదైన శైలిలో రాణిస్తోంది. ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా ఈ ఆసుపత్రి ఏటేటా సేవల్లో తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర ప్రజలకు కూడా ఈ ఆసుపత్రి తన సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. గుంటూరు సమీపంలోని నల్లపాడులో ఈ ఆసుపత్రి కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. రూ.500 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి కోసం ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే నిధులను విరాళాల రూపంలో అందించేందుకు ప్రవాసాంధ్రులు అమితాసక్తి చూపుతున్నారట. త్వరలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుందని సమాచారం. ఈ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ కాకతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News